Asianet News TeluguAsianet News Telugu

మద్యానికి కటకట... శానిటైజర్ తాగి ఏడుగురు కూలీలు మృతి

కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్ అమలు చేస్తోంది. నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలు, ఆస్పత్రులు, మెడికల్ షాపులు మినహా అన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్ వల్ల వైన్ షాప్‌లను మూసివేశారు. అయితే మద్యానికి బానిసైన కొందరు వ్యక్తులు శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. 

7 killed In Maharashtra After Drinking Hand Sanitiser ksp
Author
Mumbai, First Published Apr 24, 2021, 5:36 PM IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్ అమలు చేస్తోంది. నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలు, ఆస్పత్రులు, మెడికల్ షాపులు మినహా అన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్ వల్ల వైన్ షాప్‌లను మూసివేశారు. అయితే మద్యానికి బానిసైన కొందరు వ్యక్తులు శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు.

గతేడాది తొలి విడత లాక్‌డౌన్ వల్ల ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే జరిగింది. యావత్మల్ జిల్లాలో శానిటైజర్ తాగి ఒకే గ్రామంలో ఏడుగురు కూలీలు మరణించగా, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. యావత్మల్ జిల్లా వానీ గ్రామంలో కొందరు కూలీలు మద్యానికి బానిసయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో వైన్ షాప్‌లు మూతపడ్డాయి. ఎక్కడా మద్యం చుక్క దొరకడం లేదు.

Also Read:మే 2 తర్వాత చివరి అస్త్రం, లాక్ డౌన్ అవకాశం, మోడీ మదిలో ఏముంది..?

ఈ క్రమంలోనే మద్యానికి బానిసైన కొందరు కూలీలు శుక్రవారం శానిటైజర్ తాగారు. వీరిలో పలువురికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఏడుగరు మరణించారు.

మృతులను దత్త లాంజేవర్, నూతన్ పతారత్కర్, గణేష్ నందేకర్, సంతోష్ మెహర్, సునీల్‌గా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios