గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న డంపర్‌.. కారును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనం అయ్యారు. శనివారం ఉదయం సురేంద్రనగర్‌ జిల్లా కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అతి వేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.