జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో ఆదివారం నాడు తెల్లవారుజామున జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.రాష్ట్రంలోని భిల్వారా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. వ్యాన్ , ట్రాలీ ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించినట్టుగా అధికారులు తెలిపారు.

కోటా నుండి భిల్వారాకు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. భిల్వారా జిల్లాలోని కీసర్‌పూరలో ఈ  ప్రమాదం చోటు చేసుకొంది.వ్యాన్ లో ఏడుగురు ప్రయాణీస్తున్నారు. వీరంతా కోటా నుండి భిల్వారాకు ప్రయాణం చేస్తున్నారు. వ్యాన్ కీసర్ పూర మరో ట్రాలీని ఢీకొన్న ప్రమాదంలో  వ్యాన్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

మరణించిన ఏడుగురిలో ఆరుగురు సింగిపోలి శ్యామ్ ఏరియాకు చెందిన బిగోడ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందినవారుగా అధికారులు గుర్తించారు. మరొకరిని సల్వాతియాకు చెందినవాడిగా గుర్తించారు.

ఈ ప్రమాదంతో నేషనల్ హైవే పై గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలిసిన వెంటనే బిజోరా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.మరణించినవారిని ఉమేష్, ముఖేష్, జమనా, అమర్ చంద్, రాజు, రాథేశ్యామ్, శివ్ లాల్ గా గుర్తించారు.