న్యూఢిల్లీ: ఏడుగురు భారతీయులు లిబియాలో కిడ్నాప్ కు గురయ్యారు. గత మాసంలో వీరు కిడ్నాప్ కు గురయ్యారని భారత ప్రభుత్వం ప్రకటించింది.

కిడ్నాప్ కు గురైన వారిని సురక్షితంగా రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా భారత  విదేశాంగ శాఖ ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు కిడ్నాప్ కు గురయ్యారని భారత్ ప్రకటించింది. 

లిబియాలోని కన్‌స్ట్రక్షన్, ఆయిల్ సప్లయ్ కంపెనీలో వీరు పనిచేస్తున్నారు. ఆశ్వరీఫ్ ప్రాంతం నుండి సెప్టెంబర్ 14న కిడ్నాప్  కు గురయ్యారని ప్రభుత్వం తెలిపింది.ట్రిపోలి ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు వారు వెళ్తున్న సమయంలో కిడ్నాప్ కు గురయ్యారు. ఇండియాకు తిరిగి వచ్చే సమయంలో ఈ ఘటన చోటుచేసుకొందని  భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు.

కిడ్నాప్ కు గురైన వారిని విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ లిబియా ప్రభుత్వంతో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు  జరుపుతుందని ఆయన తెలిపారు.

తునీషాలోని ఇండియన్ ఎంబసీ కిడ్నాప్ కు గురైన వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.కిడ్నాప్ కు గురైన వారంతా క్షేమంగా ఉన్నారని భారత ప్రభుత్వం ప్రకటించింది. కిడ్నాప్ కు గురైన కుటుంబాలతో భారత ప్రభుత్వం టచ్ లో ఉంది.

లిబియాకు వెళ్లొద్దని భారత ప్రభుత్వం హెచ్చరించింది.2015లోనే ఈ హెచ్చరించిన విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి శ్రీవాస్తవ గుర్తు చేశారు.లిబియాకు వెళ్లడాన్ని ఇండియా 2016లో నిషేధించింది. ప్రస్తుతం ఈ నిషేధం కూడ అమల్లో ఉంది.

2015 లో కూడ ఇదే తరహాలో ఇండియన్లు కిడ్నాప్ కు గురయ్యారు. ఈ ఏడాదిలో నలుగురిని ఒకసారి,  39 మందిని వేర్వేరు సందర్భాల్లో  విడుదల చేశారు.