Asianet News TeluguAsianet News Telugu

ఆక్సీజన్ అందక..ఏడుగురు కరోనా రోగులు మృతి

బెంగళూరులోని ఆస్పత్రుల్లో ఆక్సీజన్ నిల్వలు లేకపోవడంతో.. ఏడుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు రోగులు మంగళవారం ఉదయం కల్బుర్గి ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోగా.. మరో ముగ్గురు బెలగావి ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయారు.

7 Covid Patients Die In Karnataka Hospitals Allegedly Due To Oxygen Shortage
Author
Hyderabad, First Published May 5, 2021, 8:32 AM IST

కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఈ మహమ్మారి చేస్తున్న ఆకృత్యాలు మామూలుగా లేవు. సెకండ్ వేవ్ లో కరోనా.. విలయ తాండవం చేస్తోంది. జనాలు కుప్పలు కుప్పలుగా రాలిపోతున్నారు. మరీ ముఖ్యంగా బ్రీతింగ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.ఈ క్రమంలో ఆక్సీజన్ లెవల్స్ తగ్గిపోతాయి. వారికి ఎక్కించడానికి ఆస్పత్రుల్లో సైతం ఆక్సీజన్ నిల్వలు సరిగా లేకపోవడంతో.. ప్రాణాలు విడుస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఆక్సీజన్ అందక ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

బెంగళూరులోని ఆస్పత్రుల్లో ఆక్సీజన్ నిల్వలు లేకపోవడంతో.. ఏడుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు రోగులు మంగళవారం ఉదయం కల్బుర్గి ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోగా.. మరో ముగ్గురు బెలగావి ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయారు.

చనిపోయిన వారిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని.. వారు చివరి స్టేజ్ లో ఉన్నారని.. ఆ రాష్ట్ర మైనింగ్ అండ్ జుయాలజీ మినిస్టర్ మురుగేష్ నైరాని పేర్కొన్నారు. ఆక్ష్న కలబుర్గి జిల్లాకు ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమాచారాన్ని ఆయన తెలియజేశారు. కాగా.. సరిగ్గా రెండు రోజుల క్రితం బెంగళూరులో ఆక్సీజన్ అందక 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరవక ముందే మరో ఏడుగురు తుదిశ్వాస విడిచారు.

ఇదిలా ఉండగా.. తమిళనాడులోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. తమిళనాడులోని  చెంగల్ పట్టులోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. దీంతో మరికొందరికి ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులును ఆస్పత్రి సిబ్బంది రోగులను ఇతర హాస్పిటల్‎కు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios