చండీఘడ్: 67 ఏళ్ల వ్యక్తి 24 ఏళ్ల యువతిని  ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు.ఈ జంటకు రక్షణ కల్పించాలని  పంజాబ్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

పంజాబ్ రాష్ట్రంలోని బలైన్ గ్రామానికి చెందిన షంషేర్‌సింగ్‌కు 67 ఏళ్లు. చండీఘడ్‌కు చెందిన నవ్‌ప్రీత్‌ కౌర్ అనే 24 ఏళ్ల యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ కూడ రెండు కుటుంబాల సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసురకొన్నారు. 

ఈ ఏడాది జనవరి మాసంలో వీరు పెళ్లి చేసుకొన్నారు.  చండీఘడ్ గురుద్వారాలో వీరిద్దరూ కూడ పెళ్లి చేసుకొన్నారు. ఈ జంట ఫోటోలు షోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురి నుండి ఈ జంటకు బెదిరింపులు వచ్చాయి.  ఈ క్రమంలోనే షంషేర్, నవ్‌ప్రీత్‌లు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.  ఈ జంటకు రక్షణ కల్పించాలని  సంగ్‌నర్‌, బర్నాల జిల్లాల ఎస్పీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.