Chief Justice NV Ramana: మన దేశంలో న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమిస్తారన్న విమర్శ సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్. వీ. రమణ తెలిపారు. ఎన్నో స్థాయుల్లో సుదీర్ఘమైన, విస్తృత సంప్రదింపుల తర్వాతే న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే.. పదవీ విరమణకు 65 ఏళ్లు తక్కువ వయసేనని అభిప్రాయ పడ్డారు.
Chief Justice NV Ramana: పదవీ విరమణ చేయడానికి 65 ఏళ్లు అంత పెద్ద వయసు కాదని, తన దృష్టిలో అది చాలా తక్కువ వయసేనని భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయ పడ్డారు. రాజ్యాంగ చట్టాలపై జరిగిన ఒక అంతర్జాతీయ చర్చలో జస్టిస్ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. పదవీ విరమణ గురించి ప్రశ్నించగా.. ఆసక్తి కర సమాధానమిచ్చారు. పదవీ విరమణ చేయడానికి 65 ఏండ్లు అంతపెద్ద వయసేమీ కాదని, అది చాలా తక్కువ వయసేనని అన్నారు.
తాను హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాలో తాను 22 ఏళ్లు పనిచేశానన్నారు. తాను ఒక రైతు కుమారుడినని, సాగు చేసుకునేందుకు తనకింకా కొంత భూమి ఉందని చమత్కరంగా సమాధానమిచ్చారు. ఒకసారి జడ్జీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్యాంగం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుందన్నారు. పదవీ విరమణ తరువాత.. ప్రజల మధ్య ఉండటం ఇష్టం..తాను ప్రజల మనిషినని, ప్రజల మధ్య ఉండేందుకు ఇష్టపడతానని జస్టిస్ రమణ అన్నారు. ఆగస్టులో పదవీ విరమణ తర్వాత తన శక్తియుక్తులను ప్రజల కోసం ఉపయోగిస్తానని అన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్నారు.
అలాగే.. భారతదేశంలో న్యాయమూర్తులు న్యాయమూర్తులను నియమిస్తారన్న అభిప్రాయం సరైంది కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఎన్నో స్థాయుల్లో సుదీర్ఘమైన, విస్తృత సంప్రదింపుల తర్వాతే న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులతోపాటు ఎందరి నుంచో అభిప్రాయాలు సేకరించిన తర్వాత చివరకు కొలీజియం వద్దకు జాబితా చేరుతుందని, అక్కడ కూడా ఆయా రాష్ట్రాల న్యాయమూర్తుల అభిప్రాయం తీసుకుంటామన్నారు. న్యాయమూర్తి నియామకంలో కొలీజియం నిర్ణయాన్ని ప్రభుత్వం వ్యతిరేకించొచ్చని, అయితే ప్రభుత్వం చెప్పే కారణాలు సంతృప్తికరంగా లేకపోతే కొలీజియం ప్రభుత్వ అభిప్రాయాన్ని తిరస్కరించవచ్చని జస్టిస్ రమణ చెప్పారు.
మహిళ న్యాయ మూర్తిల నియమకంపై ప్రధాన న్యాయమూర్తి రమణ సమాధానమిస్తూ.. ‘‘ సుప్రీంకోర్టు స్థాపించి దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలి మహిళా న్యాయమూర్తి నియమితులయ్యారు. ఇప్పుడు నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఇది ఇప్పటివరకు ఇదే అత్యధిక సంఖ్య. కానీ, ఈ సంఖ్య సరిపోదని నాకు తెలుసు. ఇంకా ఎక్కువ ఆశిస్తున్నాను. ఇటీవలి నియామకాలు, సిఫార్సులు చేరిక మహిళాలను తీసుకోవాలని చర్చలు జరగడం సంతోషకరం. మన జనాభా దాదాపు 140 కోట్లు. సామాజిక, భౌగోళిక వైవిధ్యం న్యాయవ్యవస్థలోని అన్ని స్థాయిలలో దాని ప్రతిబింబాన్ని వెతకాలి. సాధ్యమైన విస్తృత ప్రాతినిధ్యంతో ప్రజలు చేరుకుంటారు. ఇది వారి స్వంత న్యాయవ్యవస్థ అని భావిస్తారు.
