62 ఏళ్ళ వయసులో ఓ వ్యక్తి ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలోని గోవింద్ కుష్వాహా (62) రెండో భార్య హీరాబాయి కుష్వాహా (42) కాన్పులో ముగ్గురు కమలలకు జన్మనిచ్చింది. దీంతో ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో 62 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అతని 42 ఏళ్ల రెండవ భార్య ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే నెలలు నిండకుండానే ప్రసవం కావడంతో పిల్లల బరువు చాలా తక్కువగా ఉండడంతో జిల్లా ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో పిల్లలను చేర్పించారు.

వివరాల్లోకెళ్తే.. గోవింద్ కుష్వాహా, అతని మొదటి భార్య కస్తూరి బాయి లకు ఓ కొడుకు జన్మించాడు. కానీ.. ఆ కొడుకు 18 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ సంఘటన తరువాత, గోవింద్,కస్తూరి బాయి దంపతులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వారికి వైవాహిక జీవితంలో నిరాశ నెలకొంది. రెండవ బిడ్డ కోసం.. గోవింద్ కుష్వాహా తన మొదటి భార్యకు వైద్యుడికి చూపించాడు. చాలా చికిత్సలు చేయించాడు. కానీ కస్తూరి బాయి తల్లి కాలేదు. దీంతో భార్యాభర్తలిద్దరూ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

ఈ క్రమంలో మొదటి భార్య కస్తూరి బాయి మళ్లీ పెళ్లి చేసుకోమని భర్త గోవింద్ ను ఒప్పించింది. ఇలా తొమ్మిదేండ్ల క్రితం.. గోవింద్ కుష్వాహా..కంచన్‌పూర్ నివాసి హీరాబాయిని వివాహం చేసుకున్నాడు. అనేక చిక్సిత అనంతరం..అతని రెండవ భార్య హీరాబాయి మంగళవారం కలిసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురు పిల్లలూ అబ్బాయిలే. పెళ్లయిన 9 ఏళ్ల తర్వాత అతని ఇంట్లో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది.

గోవింద్ కంటే కూడా అతని మొదటి భార్య కస్తూర్బా బాయి చాలా సంతోషంగా ఉంది. హీరాబాయిని కూడా ఆమెను దగ్గరుండి చూసుకుంటుంది. ఆమె అతర్వేదియా పంచాయతీకి సర్పంచ్‌గా ఉన్నారు. వైద్యులు పర్యవేక్షణలో పిల్లలు.. మొదటి బిడ్డ బరువు 1 కేజీ 272 గ్రాములు, రెండో బిడ్డ 1 కిలో 314 గ్రాములు, మూడో బిడ్డ 1 కిలో 128 గ్రాములు. సాధారణంగా పిల్లల బరువు 2 నుండి 3 కిలోల వరకు ఉండాలి. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని SNCUలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.