24 గంటల్లో 62 మరణాలు, అతి పెద్ద జంప్: ఇండియాలో పెరిగిన కేసులు
గత 24 గంటల్లో భారతదేశంలో కరోనా వైరస్ తో 62 మంది మరణించారు. ఒక్క రోజులో ఇంత మంది చనిపోవడం ఇదే మొదటిసారి. కాగా, కరోనా వైరస్ కేసుల సంఖ్య 30వేలకు చేరువలో ఉంది.
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో భారతదేశంలో 62 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. ఒక్క రోజులో ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. దీంతో కరోనా వైరస్ మరణాల సంఖ్య 934కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 6స869 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 23.33 శాతం ఉంది.
కాగా, కరోనా వైరస్ కేసుల సంఖ్య 29,435కి చేరుకుంది. యాక్టివ్ కేసులు 21,632 ఉన్నాయి. ఒడిశాలో కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 118కి చేరుకుంది.
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,500 దాటింది. ఆ తర్వాతి స్థానం గుజరాత్ ఆక్రమించింది. ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,500 గాటింది.
ఇదిలావుంటే, కోల్ కతాలో కరోనా వైరస్ తో ఆ వైద్యుడు మరణించాడు. ఆర్థోపెడిక్ సర్జన్ అయిన ఆ వైద్యుడు సోమవారం రాత్రి మరణించాడు. ఏప్రిల్ 14వ తేదీన అతను ఆస్పత్రిలో చేరాడు. ఏప్రిల్ 17వ తేదీ నుంచి వెంటిలేటర్ పై పెట్టారు.