దేశం రోజు రోజుకీ దారుణాలు పెరిగిపోతున్నాయి. మహిళలకు అసలు రక్షణ ఉందా అనే అనుమానం కలుగుతోంది. హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దారుణ హత్యోదంతం మరవకముందే అలాంటి సంఘటనలు రోజుకోటి వెలుగుచూస్తున్నాయి. కనీసం ఊహ తెలియని చిన్నారులను కూడా కామాంధులు వదలడం లేదు. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల చిన్నారిని ఓ కిరాతకంగా దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ రాష్ట్రం టోంక్ జిల్లాకి చెందిన ఆరేళ్ల చిన్నారి శనివారం నుంచి కనిపించకుండా పోయింది. చిన్నారి కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. చిన్నారి కోసం గాలించగా... కేతడి అనే గ్రామంలో శవమై కనిపించింది.

చెట్ల పొదల్లో చిన్నారి శవాన్ని పడేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా... విస్తుపోయే విషాయాలు తెలిశాయి. చిన్నారిపై అత్యాచారం  చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా.. చిన్నారి స్కూల్ యూనిఫాం కి ఉన్న బెల్టుని మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. 

AlsoRead వెటర్నరీ డాక్టర్ రేప్, హత్య కేసు: నిందితులు వెనక్కి వచ్చి చూసి......

స్కూల్ కి అరకిలోమీటరు దూరంలో రక్తమడుగులో చిన్నారి పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. చిన్నారి మృతదేహం పడిఉన్న స్థలంలో.. బీరుసీసాలు, చిప్స్ పడి ఉన్నట్లు గుర్తించారు. మద్యం సేవించిన దుండగులు చిన్నారిపై ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

కాగా... చిన్నారి కనిపించకుండా పోయిన రోజు.. పాఠశాలలో స్పోర్స్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వెంట్ జరుగుతున్న సమయంలోనే చిన్నారి కనిపించకుండా పోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.