పార్కులో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి.. ఆ చిన్నారి మీద అత్యాచారం చేసి.. గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హర్యానాలో వెలుగుచూసింది.
న్యూఢిల్లీ : హర్యానాలోని పానిపట్‌లో ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన ఆరోపణలపై 40 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. 6 ఏళ్ల బాలిక పానిపట్‌లోని తన ఇంటి దగ్గరున్న పార్కులో తన కంటే రెండేళ్లు చిన్నవాడైన తన తమ్ముడితో కలిసి ఆడుకుంటున్నప్పుడు సోమవారం ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఆమెను పార్కు నుంచి కిడ్నాప్ చేసిన నిందితుడు అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. నిందితుడిని ఉత్తరాఖండ్‌కు చెందిన ఈశ్వర్‌గా గుర్తించామని, అతను పానిపట్‌లో ఉంటూ ధాబాలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహాన్ని పానిపట్‌లో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. అత్యాచారం తరువాత.. చిన్నారిని గొంతుకోసి హత్య చేసినట్లు.. పోస్టుమార్టం నివేదికలో తేలిందని పోలీసులు తెలిపారు.
కాగా, బాలిక కనిపించడం లేదని చిన్నారి కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలిక ఇంటి సమీపంలోని ఫ్యాక్టరీల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. పార్కులో ఆడుకుంటున్న చిన్నారిని నిందితుడు కిడ్నాప్ చేసి.. తీసుకెళ్లినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఫుటేజ్ ఆధారంగా అతడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని సోమవారం సాయంత్రం పానిపట్‌లోని సెక్టార్ 25లోని జింఖానా క్లబ్ సమీపంలో అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
ఇతను మామూలోడు కాదు.. ర్యాపిడో డ్రైవర్ తో సంభాషణ వైరల్ .. ఎందుకో తెలిస్తే మీరూ షాక్ అవుతారు...
అతడిపై ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు బాలికకు బిస్కెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని కాలువ దగ్గర పడేసి పరారయ్యాడు. గత ఐదు నెలలుగా ఈశ్వర్ పానిపట్‌లోని ఫ్లోరా చౌక్ సమీపంలోని ధాబాలో పనిచేస్తున్నాడని వారు తెలిపారు. మంగళవారం పానిపట్‌లోని కోర్టు అతడిని ఒకరోజు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన కుటుంబంలో ఈ ఘటన జరిగింది. ఆమె సోదరుడు ఓ వ్యక్తి తన సోదరిని తీసుకెళ్లాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
ఇదిలా ఉండగా, బీహార్ లో రక్షా బంధన్ రోజు జరిగిన దారుణ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రక్షాబంధన్ నాడు బీహార్‌లోని సివాన్‌లో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అన్నకు రాఖీ కట్టడం కోసం బాలిక తన సోదరుడి ఇంటికి వెళ్తుండగా ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ దారుణానికి సంబంధించిన నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేయకపోవడంతో ఈ సంఘటన స్థానిక ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
వివరాల్లోకి వెడితే, బాలిక తన సోదరుడికి రాఖీ కట్టేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి త్యాచారానికి పాల్పడ్డారు. అటుగా కారులో వెడుతున్న ఓ వ్యక్తి ఆమె అరుపులు విని.. నేరం జరిగిన ప్రదేశానికి చేరుకునేసరికి నిందితులు పారిపోయాడు. డ్రైవర్ బాలికకు సహాయం చేసి ఆమెను ఆసుపత్రిలో చేర్చాడు, అక్కడ ఆమెకు చికిత్స జరుగుతోంది. ఈ ఘటనలో బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పోలీసులు బాధితురాలి వాంగ్మూలం మేరకు పవన్ కుమార్, అంకిత్ కుమార్, ఇమాముద్దీన్, దినేష్ కుమార్‌లపై శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
