యూపీలోని హర్దోయ్ జిల్లాలోని పచ్‌దేవ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో హోలీ రోజున 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన తరువాత, హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రైఫిల్ లాక్కొని పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది. నిత్యం ఏదోక చోట మహిళలు, బాలికలపై అకృత్యాలు జరుగుతున్నాయి. వావీ వరసలు, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా యూపీలో ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారం, తరువాత హత్య చేశాడు ఓ కామాంధుడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. కానిస్టేబుల్ రైఫిల్ లాక్కొని పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

వివరాల్లోకెళ్తే.. యూపీలోని హర్దోయ్ జిల్లా పచ్‌దేవ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో 6 ఏళ్ల అమాయక బాలికపై అత్యాచారం, హత్య సంఘటన జరిగింది. హోలీ పండుగ సందర్భంగా.. గ్రామంలో ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదే సమయంలో సాయంత్రం ఆరేండ్ల చిన్నారి తన ఇంటి బయట పిల్లలతో ఆడుకుంది. ఆ బాలిక అకస్మాత్తుగా అదృశ్యమైంది. కొంత సమయం తరువాత తల్లిదండ్రులు .. ఆ చిన్నారి ఆచూకీ కోసం వెతుకుతుండగా.. ఓ నిర్మానుష్య ప్రాంతంలో విషాదకర ద్రుశ్యం కనిపించింది. అత్యాచారానికి గురై..ఆ చిన్నారి విగత జీవిగా రక్తం మడుగులో పడి ఉంది. ఈ ఘటన స్తానికులను తీవ్రంగా కలిచివేసింది. 

సమాచారం అందుకున్న ఎస్పీ రాజేష్ ద్వివేది స్థానిక పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు మృతుడి మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ దారుణ ఘటనలో పొరుగున నివసిస్తున్న మృతుడి మామ కృష్ణకుమార్ అలియాస్ కృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.వెంటనే నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో చర్యలు తీసుకున్న పోలీసులు నిందితుడికి వైద్యం చేయించేందుకు ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రమంలో నారాయణపూర్ సమీపంలో మూత్ర విసర్జన సాకుతో కారు దిగిన నిందితుడు కానిస్టేబుల్ రైఫిల్ లాక్కొని పారిపోయాడు. అంతటితో ఆగకుండా వెంబడించిన పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో నిందితుడి కాలికి బులెట్ గాయమైంది. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి నిలకడగా ఉందని, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిందితుడు తన పొరుగున ఉన్న బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై బాలికను గొంతుకోసి హత్య చేశాడని తెలిపారు.