ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాత్రూమ్ లో బంధించి మరీ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటం గమనార్హం. ఈ సంఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కోల్ కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల చిన్నారిపై 19ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని బాత్రూమ్ లో ఉంచి బయట గడియపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా... బాలిక అరుపులు విన్న తల్లిదండ్రులు చిన్నారి బయటకు తీశారు.

జరగిన సంఘటనను చిన్నారి తన తల్లిదండ్రులకు వివరించింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు చిన్నారి ఇంటి పక్కన ఉండే యవకుడిగా గుర్తించారు. అతనిని  అరెస్టు చేశారు. నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.