మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై సతారా వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

అర్థరాత్రి వీరు మృతులు ప్రయాణిస్తున్న కారు కాశిల్ గ్రామం సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరంతా కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన వారిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.