సారాంశం

Viral Video: ఒకే స్కూట‌ర్ పై ఆరుగురు వ్య‌క్తులు ప్ర‌యాణించ‌డంతో పాటు రోడ్డుపై వింత విన్యాసాలు చేశారు. ఓ వ్య‌క్తి దీనిని రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో వైర‌ల్ గా మారింది. 
 

Bike Stunt Viral Video: రోడ్ల‌పై వింత వింత విన్యాసాలు చేస్తూ.. ప్ర‌మాదాలు జ‌రిగి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య దేశంలో పెరుగుతూనే ఉంది. ఈ త‌ర‌హా ప్ర‌మాదాలు సైతం పెరుగుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయిన‌ప్ప‌టికీ కొంత మంది బైకుల‌తో రోడ్ల‌పై విన్యాసాలు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ.. ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లుగజేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ట్రాఫిక్‌ నింబంధనలను ఉల్లంఘించి ఒకే స్కూటర్‌పై ఆరుగురు వ్యక్తులు కూర్చుని ప్రయానిస్తున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఈ వీడియోలో ఒకే స్కూట‌ర్ పై ఆరుగురు ప్ర‌యాణిస్తున్నారు. దీనికి తోడు రోడ్డుపై విన్యాసాలు చేస్తున్నారు. ఇత‌ర ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది క‌లిగించారు. స్కూట‌ర్ సీటుపై సీటుపై ఐదుగురు అబ్బాయిలు ఉండగా..మరో వ్యక్తి ఓ వ్యక్తి భుజంపై కూర్చున్నాడు.  అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి ఉన్న‌ప్ప‌టికీ.. వారు ఎవ‌రూ కూడా హెల్మెట్ ధ‌రించ‌కుండా ప్ర‌యాణిస్తున్నారు. 

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబయిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అదే మార్గంలో ప్ర‌యాణిస్తున్న రమణదీప్ సింగ్ హోరా అనే వ్యక్తి ఈ దృశ్యాలను ట్వీటర్ లో పోస్టు చేశారు. దీనిని ముంబ‌యి పోలీస్, పోలీస్ కమిషనర్‌ను ట్యాగ్ చేశారు. "ట్రాఫిక్‌ నింబంధనలను ఉల్లంఘించి ఒకే స్కూటర్‌పై ఆరుగురు వ్యక్తులు కూర్చున్నారు" అని ట్వీట్ చేశాడు. ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంతో పాటు ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లుగుజేస్తూ.. ప్ర‌మాద‌క‌ర స్థితిలో విన్యాసాలు చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. దయచేసి ఇలా ఎవరు చేయకూడదని కోరారు. ఈ వీడియో వైర‌ల్ గా మారింది. నిమిషాల్లోనే వేల మంది చూడ‌టంతో వైర‌ల్ అయింది. 

ముంబ‌యి ట్రాఫిక్ పోలీసులు సైతం దీనిపై స్పందించారు. ఆ బైక్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. అంతే కాకుండా ఆ సంఘలన ఏ ప్రదేశంలో జరిగిందో..రమణదీప్ సింగ్ హోరను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు స్పందిస్తూ.. వారిపై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు చట్టం, నియమాలు, నింబంధనలు పాటించకుండా ఇలాంటి స్టంట్స్‌కి పాల్పడుతూ.. ఇత‌ర ప్ర‌యాణికుల‌ను సైతం ప్ర‌మాదంలో ప‌డేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.