గుజరాత్ రాష్ట్రంలోని వడోధరలో మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు.బస్సు, ట్రక్కును ఢీకోనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని వడోధర నగర శివార్లలో మంగళవారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.మరో 15 మంది గాయపడ్డారు.అహ్మదాబాద్ - ముంబై జాతీయ రహదారిపై ట్రక్కును బస్సుఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
లగ్జరీ బస్సు రాజస్థాన్ నుండి సూరత్ వైపు ెళ్లున్న సయంలో ఇవాళ తెల్లవారుజామున 4గంటలమకు ఈ ప్రమాదం జరిగింది. హైవేపై ఉన్నబ్రిడ్జిపై ఓవర్ టేక్ చేసే సమయంలో బస్సు ట్రక్కును ఢీకొట్టింది.దీంతో ఆరుగురు మరణించారు.మరో 15 మంది గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి యశ్ పాల్ జగనియా చెప్పారు. ప్రమాదం జరిగిన ఘటన స్థలంలోనే నలుగురు మరణించారు.మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఆయన వివరించారు.మృతుల్లో ఓ చిన్నారి,ఓమహిళ,నలుగురు పురుషులున్నారని పోలీసులు వివరించారు.
