ఇంటి పైకప్పు కూలి ఆరుగురు కన్నుమూశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఈ విషాదకర సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...చిల్లాగల్లి గ్రామానికి చెందిన నదీమ్ షేక్ అనే వ్యక్తి పండ్ల వ్యాపారిగా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన సంపాదనతో కొంత దాచి మరీ ఇటీవల మట్టితో ఇళ్లునిర్మించుకున్నాడు. అయితే... మంగళవారం రాత్రి నదీమ్ తన భార్య ఫరీదా బేగం, నలుగురు పిల్లలతో కలిసి నిద్రిస్తుండగా.. ఇంటి పై కప్పు ఒక్కసారిగా కూలి పడిపోయింది.

ఈ ఘటనలో తీవ్రగాయాలపాలై కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు వారి మృతదేహాలను బయటకు తీశారు. కాగా... ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు చెబుతున్నారు.