Bengaluru: కర్ణాటకలో ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎస్ యూవీ-బస్సు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. మృతులు బెంగళూరులోని చందాపురకు చెందిన యాత్రికులు కాగా, చామరాజనగర్ లోని మలే మహదేశ్వర ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Karnataka road accident: కర్ణాటకలో ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎస్ యూవీ-బస్సు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. మృతులు బెంగళూరులోని చందాపురకు చెందిన యాత్రికులు కాగా, చామరాజనగర్ లోని మలే మహదేశ్వర ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఎస్ యూవీ వాహనం, ప్రభుత్వ బస్సు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. జిల్లాలోని సాతనూర్ పట్టణానికి సమీపంలోని కెమ్మలే గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు బెంగళూరులోని చందాపురకు చెందిన యాత్రికులు కాగా, చామరాజనగర్ లోని మలే మహదేశ్వర ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతుల్లో నగేష్, పుట్టరాజు, జ్యోతిలింగప్ప (కారు యజమాని), గోవింద, కుమార్ ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో కారు నుజ్జునుజ్జ‌యింది. బస్సు డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా దెబ్బతిన్న ఎస్ యూవీ వాహనం నుంచి పోలీసులు మృతదేహాలను వెలికితీశారు.