ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం యమునా ఎక్స్‌ప్రెస్‌ వే మీదుగా ఓ కుటుంబం వేగనార్ కారులో నోయిడా నుంచి ఆగ్రా వెళుతుండగా.. అది ఒక్కసారిగా అదుపుతప్పి ఓ ట్రక్కును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారు. గాయాల పాలైన మరో ముగ్గురికి ఆగ్రా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మరణించిన వారిని ఉత్తరప్రదేశ్ గౌతమ బుద్ధానగర్‌ జిల్లాలోని జేవార్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ అనంతరం తన వాహనాన్ని తీసుకుని పరారైనట్లుగా స్థానికులు చెబుతున్నారు.