తమిళనాడు కాంచీపురంలో విషాదం: బాణసంచా ఫ్యాకర్టీలో పేలుడు,ఎనిమిది మంది మృతి
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో ఇవాళ జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో బుధవారంనాడు బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో 30 మంది పనిచేస్తున్నారు.
కాంచీపురం జిల్లా కురువిమలై ప్రాంతంలో ఉన్న బాణసంచా తయారీ యూనిట్ లో ఇవాళ పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఈ యూనిట్ లో పనిచేస్తున్న ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాంచీపురం జిల్లా మేజిస్ట్రేట్ , డీఐజీ పి . పాకలవన్యన్ , ఇతర పోలీస్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మరో వైపు గాయపడినవారిని ఆసుపత్రిలో అధికారులు పరామర్శించారు. బాణసంచా పేలుడుకు గల కారణాలపై అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఈ బాణసంచా తయారీ యూనిట్ లో పేలుడుతో మంటలు వ్యాపించాయి. ఈ మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. ఈ పేలుడు కారణంగా సమీపంలో ఉన్న నాలుగు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.