ఆదివారం గోడ కూలి 15 మంది వలస కూలీలు మరణించిన ఘటన మరచిపోకముందే పుణేలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో అంబెగాన్‌లోని సిన్గాడ్ పాఠశాల గోడ కూలి ఆరుగురు విద్యార్ధులు దుర్మరణం పాలవ్వగా..  ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.