అదుపుతప్పిన ఒక ట్రక్కు మిఠాయి దుకాణంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. 

హోలీ పండగ రోజున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రజలందరూ హోలీ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో ఓ ట్రక్కు...మిఠాయి దుకాణంలోకి దూసుకెళ్లింది. కాగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బీహార్‌లోని నలందా జిల్లా పరిధిలోని తాడ్పురా గ్రామంలో హోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒకవైపు హోలీ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుండగా, మరోవైపు ఈ ప్రమాదం స్థానికులను కలచివేసింది. అదుపుతప్పిన ఒక ట్రక్కు మిఠాయి దుకాణంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ సహాయక చర్యల్లో స్థానికులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఘటన అనంతరం కొందరు అల్లరి మూకలు స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. స్టేషన్‌హెడ్‌కు చెందిన సర్వీస్ రివాల్వర్ లాక్కున్నారు. తరువాత పోలీసులు వారిని శాంతింపజేసి, నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.