పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో ఆదివారంనాడు ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు.
చంఢీఘడ్: పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో ఆదివారంనాడు ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. లూథియానాలోని గియాస్‌పురా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ లీకేజీ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు పోలీసులునేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. గ్యాస్ లీకేజీకి సంబంధించిన కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.
