ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రత్నగిరిలోని తివారీ డ్యామ్ తెగిపోవడంతో లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. సుమారు 7 గ్రామాలన్నీ జలమయ్యాయి.

ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 20 నుండి 24 మంది ఆచూకీ లేకుండాపోయింది. ఈ డ్యామ్‌కు సమీపంలోని 12 ఇళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.  

ఈ ఘటనతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులు సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్రలో భారీగా  వర్షాల కురుస్తుండడంతో విమానాలు, రైళ్లు కూడ రద్దయ్యాయి.