రేప్ కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. 


రేప్ కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు అని కూడా చూడకుండా.. నిందితుడి తరపు మనుషులు.. పోలీసులను చితకబాదారు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఇద్దరు బాలికలను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి.. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకన్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసేందుకు నిందితుడి ఇంటికి వెళ్లారు.

కేసులో భాగంగా.. నిందితుడిని విచారించాలని.. అతనిని తమ వెంట తీసుకొని వెళతామని పోలీసులు చెప్పారు. అయితే.. ఈ మాట విని ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడి తరపు బంధువులు పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు.

ఆరుగురు పోలీసులకు తీవ్రగాయాలవ్వగా.. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.