ఇండియాలో ప్రవేశించినస్ట్రెయిన్ : ఆరుగురికి కొత్త వైరస్, హైద్రాబాద్ లో ఇద్దరు
కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ ఇండియాలో ప్రవేశించింది. దేశంలోని ఆరుగురికి కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ సోకినట్టుగా వైద్యులు ప్రకటించారు.
న్యూఢిల్లీ:కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ ఇండియాలో ప్రవేశించింది. దేశంలోని ఆరుగురికి కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ సోకినట్టుగా వైద్యులు ప్రకటించారు.
యూకేలో తొలుత ఈ వైరస్ ను గుర్తించారు. బ్రిటన్ నుండి ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఇతర దేశాలు ముందు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఈ ఆరుగురు కూడ యూకే నుండి తిరిగి వచ్చారు.బెంగుళూరులో ముగ్గురు, హైద్రాబాద్ లో ఇద్దరు., పూణెలో ఒక్కరికి ఈ వైరస్ సోకిందని వైద్యులు గుర్తించారు.
ఈ ఆరుగురిని సింగిల్ రూమ్ లో హోం ఐసోలేషన్ లో ఉంచారు. ఈ ఆరుగురితో కాంటాక్టులో ఉన్న వారిని కూడ క్వారంటైన్ కు తరలించారు. ఈ ఆరుగురి కాంటాక్టు ట్రేసింగ్ ను అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. ఇతర నమూనాలపై జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోంది.
నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 వరకు విదేశాల నుండి 33 వేల మంది ఇండియాకు తిరిగి వచ్చారు. వీరిలో 114 మందికి కరోనా సోకింది. ఈ 114 మంది శాంపిళ్లను భారత్ లోని 10 ల్యాబ్ లకు పంపి విశ్లేషించారు అధికారులు.