Asianet News TeluguAsianet News Telugu

మిజోరం, అసోం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం: ఆరుగురు పోలీసుల మృతి, 50 మందికి గాయాలు

మిజోరం, అసోం రాష్ట్రాల సరిహద్దు వివాదం ఆరుగురు పోలీసులు తీసింది. ఇవాళ జరిగిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మరణించారు. 

6 Assam Police personnel dead, 50 injured as violence at border with Mizoram intensifies lns
Author
Assam, First Published Jul 26, 2021, 8:35 PM IST


న్యూఢిల్లీ: మిజోరం,అసోం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో  ఆరుగురు అసోం పోలీసులు   మరణించారు. అసోంకు చెందిన ఎస్పీ చంద్రకాంత్  తీవ్రంగా గాయపడ్డాడు.మిజోరం, అసోం రాష్ట్రాల మధ్య సుమారు 164 కి.మీ దూరం ఉంది. గత ఏడాది ఆగష్టు మాసంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య  సరిహద్దు వివాదం మొదలైంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా కాచర్ జిల్లాలో ఇవాళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయి.

మిజోరం రాష్ట్రానికి చెందిన పోలీసులు జరిపిన కాల్పుల్లో  అసాం రాష్ట్రానికి చెందిన  ఆరుగురు సిబ్బంది మరణించారని అసాం సీఎం హిమాంత బిస్వాశర్మ చెప్పారు.కాచర్ ఎస్పీ నింబల్కర్ వైభవ్ చంద్రకాంత్ సహా కనీసం 50  మంది సిబ్బంది కాల్పులు, రాళ్లు రువ్వడంతో గాయపడ్డారు. అసోం, మిజోరాం సరిహద్దు వద్ద రాజ్యాంగ సరిహద్దును రక్షిస్తూ అసోం పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారని  సీఎం శర్మ చెప్పారు.

ఈ ఘటన తన హృదయాన్ని కదిలించిందన్నారు మృతుల కుటుంబాలకు హృదయ పూర్వక సంతాపాన్ని ఆయన ప్రకటించారు.ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.సరిహద్దు నుండి దుండగులు ఆకస్మాత్తుగా కాల్పులు జరిపారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఎంతమంది గాయపడ్డారనే ఇప్పుడే చెప్పలేనని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఎస్పీ సహా సుమారు 50  మందికి గాయాలయ్యాయని ఆయన చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios