Asianet News TeluguAsianet News Telugu

చైనా సరిహద్దుల్లో 59 భారతీయ గ్రామాలు ఖాళీ.. ఉత్తరాఖండ్ జిల్లాలో కొండప్రాంతాలను విడిచి వెడుతున్న ప్రజలు...

‘మూడేళ్ల క్రితం గ్రామాల్లో 16 వేల మంది జనాభా ఉండేది.  2019, 2020, 2021 లో ఇంటింటి సర్వే చేపట్టాం. బ్రాహ్మణ క్షేత్రంలోని 1,601 గ్రామాల్లో సుమారు 40-50 గ్రామాలు గడిచిన మూడేళ్లలో దాదాపు ఖాళీ అయ్యాయి’ అని  జల్ నిగమ్  అధికారి రంజిత్ ధర్మసత్తూ తెలిపారు.
 

59 Indian villages are vacant in the Chinese border
Author
Hyderabad, First Published Dec 13, 2021, 12:29 PM IST

భారత సరిహద్దులకు సమీపంలో చైనా కొత్తగా గ్రామాలను నిర్మిస్తూ ప్రజలను తరలిస్తున్నట్లు  చాలా వార్తలు వస్తున్నాయి.  అదే సమయంలోIndo-Nepal borderల్లోని గ్రామాలు ఖాళీ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దులను గురించి ప్రజలు వలస వెళ్తున్నారు. uttarakhandలోని పిథోరాగఢ్ జిల్లాలో  చైనా నేపాల్ సరిహద్దుల్లో ఉన్న  59 గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి.

ఏ గ్రామంలో చూసినా మనిషి జాడ కనిపించే పరిస్థితులు లేవు. Jal Jeevan Mission తాజా నివేదిక ప్రకారం... పిథోరాగఢ్  జిల్లాలోని ప్రస్తుతం 1542 గ్రామాల్లోనే ప్రజలు ఉన్నారు. మూడేళ్ళ క్రితం ఆ సంఖ్య 1,601 గా ఉండేది. 59 గ్రామాలు పూర్తిగా  ఖాళీ అయ్యాయి. ఇందులో పిథోరాగఢ్  తహసీల్ లో 13,  గంగోలి హాట్,  didihat, బెరీ నాగ్  తాలూకాల్లో ఒక్కో దాంట్లో ఆరు, ధారచూలాలో 3, గణాఈ- గంగోలి, ఫాంఖూ, థాల్ లో 3 చొప్పున గ్రామాలు ఎడారిని తలపిస్తున్నాయి.

‘మూడేళ్ల క్రితం గ్రామాల్లో 16 వేల మంది జనాభా ఉండేది.  2019, 2020, 2021 లో ఇంటింటి సర్వే చేపట్టాం. బ్రాహ్మణ క్షేత్రంలోని 1,601 గ్రామాల్లో సుమారు 40-50 గ్రామాలు గడిచిన మూడేళ్లలో దాదాపు ఖాళీ అయ్యాయి’ అని  జల్ నిగమ్  అధికారి రంజిత్ ధర్మసత్తూ తెలిపారు.

41 గ్రామాల్లో సగమే..
మైగ్రేషన్ కమిషన్  డేటాను పరిశీలిస్తే పిథోరాగఢ్  జిల్లాలో 41 గ్రామాల్లో 50 శాతానికి పైగా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అందులో  gangolihat  అభివృద్ధి బ్లాక్లో 25, బేరినాగ్  బ్లాక్ లో 12 గ్రామాలు, కనాలిచినా, మూనాకోటే బ్లాకుల్లో రెండు గ్రామాల్లో సగానికి పైగా ప్రజలు వలస వెళ్లారు.

వలసలకు కారణాలేంటి...
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 21 ఏళ్లు గడుస్తున్నా సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి కోసం గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించింది. కానీ, ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కనీస వసతులు లేవు. చాలా గ్రామాలకు సరైన రోడ్లు లేవు. విద్యుత్తు, నీరు, సమాచారం, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల  వలసలు పెరుగుతున్నాయి. జిల్లాలో సరైన వైద్య సౌకర్యం లేకపోవడం  ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

మారని డ్రాగన్: ఓ వైపు కయ్యం.. మరో వైపు సరిహద్దుల్లో గ్రామాలు

ఇదిలా ఉండగా, ఇండో- చైనా సరిహద్దుల్లో డ్రాగన్ కుట్రలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. జూన్ నుంచి డిసెంబర్ 6 వరకు సరిహద్దుల్లో ఏదో ఒక చోట ఉద్రిక్తతలు పెంచే కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. ఎప్పటి నుంచో అరుణాచల్ ప్రదేశ్‌ తమదేనని వాదిస్తున్న చైనా .. ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో మూడు గ్రామాలనే ఏర్పాటు చేసింది. 

960 కుటుంబాలను(దాదాపు  3,222 మంది)  వాలంటరీ బేసిస్‌పై ఈ గ్రామాలకు తరలించింది. భారత్‌, చైనా, భూటాన్ దేశాల జంక్ష‌న్‌లో అరుణాచ‌ల్ ప్రదేశ్‌కు ప‌శ్చిమాన ఉన్న బ‌మ్ లా పాస్‌కు 5 కిలోమీట‌ర్ల దూరంలోనే ఈ గ్రామాలను నిర్మించింది. డోక్లామ్ సైనిక ఘర్షణ జరిగిన స్థలానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో చైనా గ్రామాల నిర్మాణానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజ్‌లు తేటతెల్లం చేస్తున్నాయి.

కాగా లద్దాఖ్‌ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలోనే చైనా ఈ మూడు గ్రామాలను నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 17న ఆ ప్రాంతంలో 20 నిర్మాణాల‌తో చైనా తొలి గ్రామాన్ని నిర్మించిన‌ట్లు ప్లానెట్ ల్యాబ్స్ తీసిన ఫొటోలు తేటతెల్లం చేస్తున్నాయి.ఆ త‌ర్వాత న‌వంబ‌ర్ 28 నాటికి ఆ ప‌క్క‌నే మ‌రో రెండు గ్రామాలు వెలిశాయి. అందులో ఒక గ్రామంలో 50 వ‌ర‌కు నిర్మాణాలు ఉన్నాయి. ఈ మూడు గ్రామాలను అధునాత‌న రోడ్ల‌తో అనుసంధానించారు.

Follow Us:
Download App:
  • android
  • ios