Asianet News TeluguAsianet News Telugu

కరోనా మహమ్మారి.. అనాథలుగా మారిన 577మంది చిన్నారులు!

కరోనా కారణంగా ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు మద్దతు ఇవ్వడానికి.. వారిని రక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 

577 Children Orphaned Due To Covid Since April 1: Smriti Irani
Author
Hyderabad, First Published May 26, 2021, 9:25 AM IST

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా 577మంది చిన్నారులు అనాథలుగా మారిపోయారని.. మహిళా శిశు సంరక్షణ మంత్రి స్మృతి ఇరానీ  పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశంలో 577మంది చిన్నారులు అనాథలయ్యారని ఆమె పేర్కొన్నారు.

కరోనా కారణంగా ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు మద్దతు ఇవ్వడానికి.. వారిని రక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

‘కరోనా కారణంగా ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలకు  మద్దతు ఇవ్వడానికి.. రక్షించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2021 ఏప్రిల్ 1 నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 577మంది పిల్లలు అనాథలుగా మారినట్లు గుర్తించారు.’ అని స్మృతీ ఇరానీ ట్వీట్ చేశారు.

అనాథలుగా మారిన చిన్నారులను పట్టించుకోకుండా వదిలేయలేదని... జిల్లా అధికారుల సంరక్షణలో ఉన్నారని... అలాంటి పిల్లలకు కౌన్సిలింగ్ అవసరమైతే.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యోరో సైన్స్ బృందం సిద్ధంగా ఉందని చెప్పారు. పిల్లల సంక్షేమం కోసం నిధుల కొరత కూడా లేదని ఆమె పేర్కొన్నారు.

"ఈ పిల్లల గురించి కేంద్రం రాష్ట్రాలు మరియు జిల్లాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. వారి సంక్షేమానికి నిధుల కొరత లేదు. యునిసెఫ్ సహా అన్ని వాటాదారులతో మహిళలు మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమావేశాలు నిర్వహించింది" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios