Raipur: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత దారుణంగా మానసిక వైక‌ల్యం ఉన్న ఓ మహిళపై లైంగిక‌దాడి జ‌రిపి.. ఇనుపరాడ్ తో  చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి.. చివ‌ర‌కు బండ‌రాయితో త‌ల‌ని  బండ‌రాయితో కొట్టి ప్రాణాలు తీసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.  

Chhattisgarh: మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ఎన్ని చ‌ట్టాలు తీసుకువచ్చినా దేశంలోని ఏదో ఒక చోట నిత్యం వారిపై దాడులు, హింస‌, అఘాయిత్యాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే అత్యంత దారుణంగా మానసిక వైక‌ల్యం ఉన్న ఓ మహిళపై లైంగిక‌దాడి జ‌రిపి.. ఇనుపరాడ్ తో చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి.. చివ‌ర‌కు త‌ల‌ని బండ‌రాయితో కొట్టి ప్రాణాలు తీసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మొద‌ట స‌ద‌రు మ‌హిళ రోడ్డు ప్రమాదం కార‌ణంగా చ‌నిపోయింద‌ని పోలీసులు అనుమానించారు. అయితే, ద‌ర్యాప్తులో భాగంగా పోస్టుమార్టంతో పాటు.. ఘ‌ట‌న చోటుచేసుకున్న ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు ప‌రిశీలించ‌గా ఈ దారుణం వెలుగుచూసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. మానసిక వైక‌ల్యం ఉన్న ఓ మహిళపై లైంగిక‌దాడి జ‌రిపి.. ఇనుపరాడ్ తో చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి.. చివ‌ర‌కు బండ‌రాయితో త‌ల‌ని బండ‌రాయితో కొట్టి ప్రాణాలు తీసిన ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో వెలుగుచూసింది. 56 ఏండ్ల మహిళపై అత్యాచారం చేసి, ఆమె తలను బండరాయితో పగలగొట్టే ముందు ఇనుప రాడ్‌తో దారుణంగా ఆమెను చిత్ర‌హింస‌ల‌కు గురిచేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. మానసిక వైకల్యం ఉన్న మహిళ.. గత బుధవారం చాలా దారుణంగా గాయ‌ప‌డి.. రోడ్డు ప్రమాదంలో చ‌నిపోయిన‌ట్టుగా ప‌డివున్న మ‌హిళ మృత‌దేహాన్ని జాంజ్‌గిర్-చంపా జిల్లాలోని పోలీసులు గుర్తించారు. మొద‌ట ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయారని భావించారు. అయితే, శ‌వ‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. జ‌రిన ఘోరం ఘోరం బయటపడింది.

ఈ క్ర‌మంలోనే పోలీసులు ద‌ర్యాప్తులో భాగంగా సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలను ప‌రిశీలించ‌గా.. ఆమెపై ఎవరో క్రూరంగా దాడి చేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు గుర్తించారు. ఆమె కడుపుపై ​​తన్నాడు, కళ్లపై కొట్టి, ఇనుప రాడ్‌తో క్రూరంగా చిత్ర‌హింస‌లు పెడుతున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. నిందితుడి గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. "31 ఏళ్ల కిషన్ యాదవ్‌ను విచారణ తర్వాత అరెస్టు చేశారు. అతను నేరాన్ని అంగీకరించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో అతను ఆమెను జుట్టు పట్టుకుని సమీపంలోని ఏకాంత ప్లాట్‌లోకి తీసుకెళ్లాడు. అనంత‌రం ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో ఆమెపై దాడి చేసిన‌ట్టు నిందితుడు చెప్పిన‌ట్టు" సీనియర్ పోలీసు అధికారి అభిషేక్ పల్లవ తెలిపారు.

"ఆమె దాడిని ప్ర‌తిఘ‌టిస్తూనే ఉంది. అయితే, నిందితుడు ఆమెపై కోపంతో ర‌గిలిపోయి.. ఆమెను కొట్టడం ప్రారంభించాడు.. దారుణంగా ఇనుప రాడ్డుతో చిత్రహింస‌లు పెట్టాడు. అనంత‌రం బండరాయితో త‌ల‌ను కొట్టి చంపాడు. తర్వాత అతను అక్కడి నుండి పారిపోయాడు" అని పోలీసులు తెలిపారు. కాగా, చ‌నిపోయిన మ‌హిళ మాన‌సిక వైకల్యంతో బాధ‌ప‌డుతున్న‌ద‌ని పోలీసులు పేర్కొన్నారు. కొన్ని సంవ‌త్స‌రాల కింద‌ట ఆమె త‌న త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయింది. స్థానికులు పెట్టింది తిని కాలం వెళ్లదీస్తున్న‌ద‌ని చెప్పారు.