దేశంలో 551 కొత్తగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు: పీఎం కేర్స్ నిధుల వినియోగం
దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు కేంద్రం వేగంగా నిర్ణయాలు తీసుకొంటుంది. 551 అంకితమైన ప్రెజర్ స్వింగ్ యాడ్సర్పన్ (పీఎస్ఏ) మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు చేయనుంది.
న్యూఢిల్లీ: దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు కేంద్రం వేగంగా నిర్ణయాలు తీసుకొంటుంది. 551 అంకితమైన ప్రెజర్ స్వింగ్ యాడ్సర్పన్ (పీఎస్ఏ) మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు చేయనుంది.ఈ ప్లాంట్ల ఏర్పాటుకు పీఎం కేర్స్ ఫండ్ నుండి నుండి నిధుల విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ప్రభుత్వాసుపత్రుల్లో అదనంగా 162 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ. 201.58 కోట్లను కేటాయించింది. ఈ ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ డిమాండ్ తీవ్రంగా ఉంది. దీంతో 551 కొత్త ఆక్సిజన్ ప్లాంట్లకు కేంద్రం అనుమతిచ్చింది.ఈ ఆక్సిజన్ ప్లాంట్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రధాని కార్యాలయం ఆదేశించింది. దేశంలోని ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఆక్సిజన్ డిమాండ్ ఉందనే విషయాన్ని గుర్తించి ఆయా ఆసుపత్రుల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.
also read:మరో వారం లాక్‌డౌన్ పొడిగింపు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను స్థాపించడం ద్వారా ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు మృత్యువాతపడుతున్నారు.