Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్ నుంచి భార‌త్ కు చేరుకున్న సిక్కు శరణార్థులు.. ఎంత మంది వచ్చారంటే..? 

ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇద్దరు పిల్లలతో సహా 55 మంది సిక్కు, హిందూ శరణార్థులతో కూడిన చివరి బ్యాచ్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుంది.ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్ని తన ట్విట్టర్ వేదికగా శరణార్థుల రాక గురించి చెప్పారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధన్యవాదాలు తెలిపారు.

55 Sikh, Hindu refugees from Afghanistan arrive in Delhi
Author
First Published Sep 26, 2022, 4:06 AM IST

ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇద్దరు చిన్నారులతో సహా 55 మంది సిక్కు, హిందూ శరణార్థులతో కూడిన చివరి బ్యాచ్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుంది. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్ని తన ట్విట్టర్ వేదికగా శరణార్థుల రాక గురించి చెప్పారు. 

ఈ సందర్భంగా.. సాహ్ని ట్వీట్ చేస్తూ, “దేవుని దయతో 55 మంది సిక్కులు, హిందువులతో కూడిన చివరి బ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ నుండి న్యూఢిల్లీకి సురక్షితంగా చేరుకుంది. వారికి ఇ-వీసాలు జారీ చేసి.. అక్కడి నుంచి తీసుకురావడంలో సహకరించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు. SGPCకి కూడా ధన్యవాదాలు.అని పేర్కొన్నారు.  'నా కుటుంబం, నా బాధ్యత'అనే కార్యక్రమం కింద వారికి పునరావాసం కల్పిస్తామని తెలిపారు.

భారత్, ఆఫ్ఘన్ ప్రభుత్వాల ఉమ్మడి కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అక్కడ మైనారిటీ వర్గానికి చెందిన ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు  ప్రాణహాని ఉన్నందున విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇ-వీసాలను మంజూరు చేసింది.

ప్రస్తుతం 43 మంది హిందువులు,సిక్కులు ఆఫ్ఘనిస్తాన్‌లో నివసిస్తున్నారని, 9 ఈ-వీసా దరఖాస్తులు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఈ "చివరి బ్యాచ్" శరణార్థుల ఇ-వీసాను విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో ఆమోదించిందని ఆయన చెప్పారు. వారందరినీ తీసుకురావడానికి అమృత్‌సర్‌లోని శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్‌జిపిసి) ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసిందని ఎంపీ సాహ్ని తెలిపారు. ఇంతకు ముందు సన్ ఫౌండేషన్, వరల్డ్ పంజాబీ ఆర్గనైజేషన్ సంయుక్త సహాకారంతో .. ఆప్ఘాన్ లో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి మేము విదేశాంగ మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదిస్తున్నాము" అని చెప్పారు.

తన సంస్థ 'మై ఫ్యామిలీ, మై రెస్పాన్సిబిలిటీ' కార్యక్రమం కింద పశ్చిమ ఢిల్లీలో ఇప్పటికే 543 ఆఫ్ఘన్ సిక్కు, హిందూ కుటుంబాలకు పునరావాసం కల్పించామని ఆయన చెప్పారు. పశ్చిమ ఢిల్లీలోని అర్జున్ నగర్‌లో ఉన్న గురుద్వారా వద్ద శరణార్థులకు స్వాగతం పలికేందుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సాహ్ని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి సిక్కు, హిందూ శరణార్థులు ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి కాదు.

ఇంతకు ముందు సిక్కులు, హిందువులను ఇక్కడికి తీసుకొచ్చారు. వాస్తవానికి, ఆఫ్ఘనిస్తాన్‌లో సిక్కు,హిందూ కుటుంబాలపై నిరంతర దాడుల కారణంగా వారిని భారత్ కు తీసుకరావాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు భారత ప్రభుత్వం ప్రణాళిక వేసింది. ఒంటరిగా ఉన్న కుటుంబాలను భారతదేశానికి తీసుకురావడానికి ఇ-వీసా ద్వారా అక్కడి నుంచి భారత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios