Imphal: మణిపూర్ హింసాకాండ కేసుల విచారణకు ఇద్దరు మహిళా డీఐజీ స్థాయి అధికారులు సహా 53 మంది అధికారులను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నియమించింది. సీబీఐ నియమించిన అధికారులలో ఇద్దరు మహిళా డీఐజీ స్థాయి అధికారులు, ఒక పురుష డీఐజీ స్థాయి అధికారి, ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉన్నారు.
Manipur violence: మణిపూర్ హింసాకాండ కేసుల విచారణకు ఇద్దరు మహిళా డీఐజీ స్థాయి అధికారులు సహా 53 మంది అధికారులను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నియమించింది. సీబీఐ నియమించిన అధికారులలో ఇద్దరు మహిళా డీఐజీ స్థాయి అధికారులు, ఒక పురుష డీఐజీ స్థాయి అధికారి, ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉన్నారు.
వివరాల్లోకెళ్తే.. ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్ లో ఇటీవల చోటుచేసుకున్న హింసాకాండ, మహిళలపై లైంగిక దాడులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణను ముమ్మరం చేసింది. మణిపూర్ లో మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన రెండు కేసులు సహా ఇప్పటివరకు ఎనిమిది కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ నమోదు చేసింది. అయితే మరిన్ని కేసులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపినట్టు ఏఎన్ఐ నివేదించింది. కేసుల తీవ్రతను చూసి సీనియర్ అధికారులను రంగంలోకి దింపుతున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను తప్పనిసరి కావడంతో మహిళా అధికారులు పరిష్కరిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మే 3 న మణిపూర్ హైకోర్టు రాష్ట్రంలో మెజారిటీ కమ్యూనిటీ అయిన మైతీలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన తరువాత మే 3న మైతీ, కూకీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 160 మంది చనిపోయారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. మణిపూర్ రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. మణిపూర్ ప్రజలకు యావత్ దేశం అండగా నిలుస్తుందన్నారు. "అన్ని వివాదాల పరిష్కారానికి శాంతి ఒక్కటే మార్గం. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రంలో శాంతి నెలకొనేలా కేంద్రం, మణిపూర్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి" అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
కాగా, ఈ నెల ప్రారంభంలో లోక్ సభలో మణిపూర్ హింసపై మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో మూడు నెలలుగా కొనసాగుతున్న హింసాకాండకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. 'వచ్చి చర్చలు జరపండి. ఇరువర్గాలు కేంద్రంతో కూర్చుని మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. జనాభాను మార్చాలని మేం కోరుకోవడం లేదు. హింస ఏ సమస్యకూ పరిష్కారం కాదు. రాష్ట్రంలో శాంతిని తీసుకొస్తాం. ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని" అమిత్ షా అన్నారు.
