ఢిల్లీలో ఫ్రిడ్జ్‌లోపల 50 ఏళ్ల వ్యక్తి విగతజీవుడై కనిపించాడు. మృతుడిని జాకీర్‌గా గుర్తించారు. జాకీర్ తన కుటుంబానికి దూరంగా ఒంటరిగా జీవిస్తున్నట్టు తెలిసింది.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ 50 ఏళ్ల వ్యక్తి డెడ్‌బాడీ రిఫ్రిజిరేటర్‌లో లభించింది. ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ఏరియాలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు విషయం తెలియగానే స్పాట్‌కు చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తిని జాకీర్‌గా గుర్తించారు.
శుక్రవారం సాయంత్రం 7.15 గంటల ప్రాంతంలో తమకు ఓ కాల్ వచ్చిందని, తన బంధువు ఒకరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని కాలర్ పోలీసులకు వివరించారు. పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత ఆమె గౌతంపురికి చేరుకున్నారు. ఆయన రూమ్‌కు వెళ్లగానే అంతా నిశ్శబ్దంగా ఉండటాన్ని గమనించింది. అనుకోకుండా ఫ్రిడ్జ్ డోర్ తీయగానే ఆమె కళ్లు బైర్లుకమ్మే విషయం తెలియవచ్చింది. ఫ్రిడ్జ్‌లో జాకీర్ డెడ్‌బాడీ కనిపించింది. ముందుగానే పోలీసులకు విషయం చెప్పడంతో వారు ఆ ఫ్లాట్ వైపుగా ప్రయాణమై వచ్చారు.
పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారని, అక్కడ రిఫ్రిజిరేటర్‌లో మృతదేహం ఉన్నట్టు గుర్తించారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
మరణించిన జాకీర్ అనే వ్యక్తి ఒంటరిగా జీవిస్తున్నట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వివరించారు. ఆయన భార్య, వారి పిల్లలకు ఆయన దూరంగా జీవిస్తున్నట్టు తెలిసింది.
పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తును ప్రారంభించారు. అయితే, ఈ మర్డర్ కేసులో ఓ క్లూ తమకు దక్కిందని, త్వరలోనే ఈ కేసును పరిష్కరిస్తామని పోలీసులు వివరించారు.
