Asianet News TeluguAsianet News Telugu

జీఎస్టీ కౌన్సిల్ 50వ సమావేశంలో కీలక నిర్ణయాలు..ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే..

GST Council Meeting: నేడు జ‌రిగే 50వ జీఎస్‌టీ కౌన్సిల్ స‌మావేశంలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్ర‌జ‌లకు పలు విషయాల్లో ఊరట నిచ్చిన.. మరికొన్ని విషయాల్లో మాత్రం షాక్ ఇచ్చింది. రానున్న రోజుల్లో ఏవి మరింత ప్రియం కానున్నాయో.. ఏవి చౌక కానున్నాయో ఓ లూక్కెద్దాం.. 

50 TH GST Council meeting Highlights  nirmala sitharaman  KRJ
Author
First Published Jul 11, 2023, 11:15 PM IST

GST Council Meeting: జీఎస్టీ కౌన్సిల్ 50వ సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో సీతారామన్‌ మాట్లాడుతూ.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, క్యాసినోల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ అంగీకరించింది. సినిమా హాళ్లలో తినుబండారాల ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సినిమా హాళ్లలో ఆహార పానీయాలపై జీఎస్టీని తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

ధరలు పెరిగేవి..
 

  • GST కౌన్సిల్‌లో నిర్ణయం బుధవారం సెషన్‌లో ఆన్‌లైన్ గేమింగ్ స్టాక్‌లపై దృష్టిని సారించారు. ఆన్‌లైన్ గేమింగ్‌కు జిఎస్‌టి కౌన్సిల్ షాక్ ఇచ్చింది. ఆన్‌లైన్ గేమింగ్ పై 28 శాతం జీఎస్టీ విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది. రేఖా ఝున్‌జున్‌వాలా-మద్దతుగల నజారా టెక్నాలజీస్, జెన్సార్ టెక్నాలజీస్, డెల్టా కార్ప్, ఆన్‌మొబైల్ గ్లోబల్, టెక్ మహీంద్రా, TCS మరియు ఇన్ఫోసిస్ ప్రస్తుతం టాప్ గేమింగ్ స్టాక్‌లలో ఉన్నాయి.
  •  క్యాసినోలు, గుర్రపు పందాలు రేట్లు  మరింత పెరుగనున్నాయి. వీటి పైన జీఎస్‌టీ 28 శాతం పెరిగే అవకాశం ఉంది. మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని కమిటీ ఈ మూడింటి మీద ట్యాక్స్ పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.

 

  • మల్టీ యుటిలిటీ వెహికల్స్ (MPV), క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (XUV) ధరలు కూడా పెరిగే అవకాశముంది. కేంద్రం & రాష్ట్ర అధికారులతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీ వీటి మీద 22 శాతం సెస్‌ వసూలు చేయాలని సిఫార్సు చేసింది. సమావేశం అనంతరం సీతారామన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం సెస్ విధించేందుకు ఎస్‌యూవీల నిర్వచనంలో నాలుగు ప్రమాణాలు ఉంచామని చెప్పారు. ఈ ప్రమాణాలు ఏమిటంటే – SUV అంటే.. నాలుగు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ పొడవు ఉండాలి, 1,500 cc లేదా అంతకంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉండాలి. బరువు లేకుండా కనీసం 170 mm 'గ్రౌండ్ క్లియరెన్స్' కలిగి ఉండాలి. 

 
ధరలు తగ్గేవి ..

సినీ ప్రేమికులకు శుభవార్త 

  • జీఎస్టీ కౌన్సిల్ సినీ ప్రేమికులకు శుభవార్త చెప్పింది. ఇకపై సినిమా హాళ్లలో తక్కువ ధరకే తినుబండారాలు, పానీయాల లభ్యం కానున్నాయి. సినిమా హాళ్లలో అందించే తినుబండారాలపై  జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. ఇది అంతకుముందు 18 శాతంగా ఉంది. దీంతో పాటు మరికొన్ని ఉత్పత్తులపై కూడా జీఎస్టీని తగ్గించారు.
  • పాప్‌కార్న్, శీతల పానీయాలు, ఇతర ఆహార పదార్థాలు సినిమా యజమానులకు గణనీయమైన ఆదాయ వనరులు కావున వీటిపైనా ధరలను పెంచితే..సామాన్యులు ఇబ్బంది పడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జీఎస్‌టీ నిర్ణయిస్తారు. 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

క్యాన్సర్ రోగులకు ఉపశమనం

  • జీఎస్టీ కౌన్సిల్ క్యాన్సర్ రోగులకు ఊరటనిచ్చింది. ఇప్పుడు దిగుమతి చేసుకున్న క్యాన్సర్ మందులపై IGST వర్తించదు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేన్సర్‌తో పోరాడేందుకు ఉపయోగించే మందులను, అరుదైన వ్యాధులకు ఉపయోగించే మందులను జీఎస్టీ నుంచి మినహాయించాలని నిర్ణయించారు. దీంతో క్యాన్సర్ మందు డైనటుక్సిమాబ్  (dinutuximab/qarziba) చౌకగా లభించనుంది.
  • ప్రైవేట్ కంపెనీలు అందించే ఉపగ్రహ ప్రయోగ సేవలను కూడా జీఎస్టీ నుంచి మినహాయిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.కమిటీ దీనిపైనా కూడా ట్యాక్ తగ్గింపుని కల్పించడానికియోచిస్తోంది.
  • ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2022ని సవరించింది. దీని కింద, GST యొక్క సాంకేతిక విభాగాన్ని నిర్వహించే GSTN, ED సమాచారాన్ని పంచుకునే సంస్థల జాబితాలో చేర్చబడింది.  

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే పలు రాష్ట్రాలు  వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న వివిధ రాష్ట్రాలు ఆందోళనలు చేశాయి. ఈ నిర్ణయంలో GST నెట్‌వర్క్ (GSTN)తో సమాచారాన్ని పంచుకోవడానికి ED అనుమతించబడింది. దీనిని 'పన్ను ఉగ్రవాదం'గా అభివర్ణిస్తూ.. చిన్న వ్యాపారులు దీనితో భయపడుతున్నారని పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా అన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios