న్యూఢిల్లీ:అందమైన అమ్మాయి భారత జవాన్లను లక్ష్యంగా చేసుకొని కీలకమైన సమాచారాన్ని సేకరించింది. ఇలా ఓ సైనికుడు ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నలకు సమాచారాన్ని ఇచ్చాడు. అయితే తనకు పాకిస్థాన్ కు చెందిన  ఇంటలిజెన్స్‌కు చెందిన మహిళ ఫేస్‌బుక్ లో సమాచారాన్ని సేకరించిందని తెలిసి షాకయ్యాడు ఆర్మీ జవాన్.

ఫేస్‌బుక్‌లో అనికా చోప్రా అని  పాకిస్థాన్‌ ఇంటలిజెన్స్‌కు చెందిన మహిళ.  అయితే ఆమె ఫేస్‌బుక్‌లో తప్పుడు ప్రోఫైల్ క్రియేట్ చేసింది. సోమ్ వీర్ సింగ్‌కు 2016 ఫేస్‌బుక్ లో పరిచయమైంది. తాను మిలటరీ నర్సింగ్ కార్ప్స్‌కు కెప్టెన్‌గా పరిచయం చేసుకొంది.  

భారత ఆర్మీ అంటే తనకు గౌరవమని  ఆమె చెప్పుకొంది.వీరిద్దరి మధ్య సంబంధం ఎంతవరకు వచ్చిందంటే  భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని కూడ సోమ్‌వీర్‌సింగ్‌పై ఆమె ఒత్తిడి తీసుకొచ్చింది.

భారత ఆర్మీకి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని కూడ ఇవ్వాలని ఆమె కోరింది. ఆమె కోరిక మేరకు కీలకమైన సమాచారాన్ని కూడ  సోమ్ వీర్ సింగ్ ఆమెకు పంపాడు. సోమ్ వీర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన తోటి జవాన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగు చూసింది.

సోమ్ వీర్ సింగ్  ఉపయోగిస్తున్న సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచితే  ఈ విషయం వెలుగు చూసింది. అనికా చోప్రాకు,సోమ్ వీర్ సింగ్ మధ్య చోటు చేసుకొన్న సంభాషణలు బట్టబయలయ్యాయి. 

సుమారు 50 మంది  భారత ఆర్మీ జవాన్లకు  అనిక్ చోప్రా వల విసిరిందని  పోలీసులు గుర్తించారు. ఆమె వ్యక్తిగత వివరాలను తాను ఎప్పుడూ అడగలేదని సోమ్‌వీర్ సింగ్ చెప్పారు. సోమ్ వీర్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.