కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి, ప్రియాంక గాంధీ సోమవారం లక్నోలో నిర్వహించిన ర్యాలీలో దొంగలు రెచ్చిపోయారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన తర్వాత తొలిసారిగా ఆమె ఉత్తరప్రదేశ్ వచ్చారు.

ఢిల్లీ నుంచి లక్నో చేరుకున్న ప్రియాంక విమానాశ్రయం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు  షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో కొందరు దొంగలు చేతివాటాన్ని చూపించి సుమారు 50 మంది మొబైల్స్‌ను చోరీ చేశారు. ఈ క్రమంలో ఓ దొంగను పట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అతనిని పోలీసులకు అప్పగించారు.

పార్టీ కార్యకర్తలే కాకుండా, నేతలు, ఏకంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీషాన్ హైదర్‌ల ఫోన్లు చోరీ అయ్యాయి. మొత్తం 50 మంది తమ మొబైల్స్ చోరీ అయినట్లుగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘరానా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.