ఈ కేటుగాళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్‌టవర్‌నే మయం చేశారు.
బెంగళూరులో కొందరు కేటుగాళ్లు ఏకంగా మొబైల్ టవర్‌నే ఎత్తుకెళ్లారు. మహదేవపురాలోని గోశాల రోడ్‌లోని 50 అడుగుల పొడవు, 10 టన్నుల బరువున్న టవర్‌ను దొంగలించారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో విచిత్ర దొంగతనం వెలుగు చూసింది. కొంతమంది దొంగలు ఏకంగా మొబైల్ టవర్ పైన కన్నేశారు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఒక్కే పార్ట్ ను విడి సామానును తరలించారు. ఈ ఘటన మహదేవపురలోని గౌశాల రోడ్డు లోని ఉన్న 50 అడుగుల పొడవు, 10 టన్నుల బరువున్న మొబైల్ ఫోన్ టవర్ తోపాటు.. డీజిల్ జనరేటర్, బ్యాటరీ బ్యాంక్ చోరీకి గురయ్యాయి.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆగస్ట్ 1 మరియు సెప్టెంబర్ 1, 2022 మధ్యకాలంలో మొబైల్ టవర్, దాని విడిభాగాలను అపహరించిన దొంగల కోసం పోలీసులు వెతుకుతున్నారు. సెల్ కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ టవర్‌ను 2009లో ఏర్పాటు చేశారు. ఆ టవర్ కనీసం 50 అడుగుల పొడవు , 10 టన్నుల బరువు ఉంటుంది. చోరీ అయిన టవర్ విలువ రూ.17 లక్షలు ఉంటుందని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.
వివిధ మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల కోసం తమ ఇన్‌స్టాలేషన్‌లను నిర్వహిస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 17 లక్షలకు పైగా విలువైన టెలికాం టవర్ , దాని ఉపకరణాలను దొంగిలించిన దుండగులను కనుగొనడానికి దాని జోక్యం మరియు పోలీసులను ఆదేశించాలని కోరుతూ సంస్థ మొదట సంబంధిత కోర్టును ఆశ్రయించింది.
కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు
కోర్టు ఆదేశాల మేరకు మహదేవపుర పోలీసులు జనవరి 1న ఈ దొంగతనంపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 379 (దొంగతనం) కింద గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సంస్థ యొక్క ప్రకటన ప్రకారం.. 'టవర్ 2009 లో స్థాపించబడింది. అయితే, దానిని నిర్వహించే బాధ్యతను అప్పగించిన టెక్నీషియన్ ఆగస్టు 2022లో ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. సెప్టెంబరు 2022లో మరొక సాంకేతిక నిపుణుడిని నియమించారు. అతను సైట్‌ను సందర్శించే సమయానికి.. టవర్ అదృశ్యమైంది. విచారణలో, కొంతమంది వ్యక్తులు టవర్‌ను తెరిచినట్లు తాము చూశామని స్థానికులు తెలిపారు. దొంగిలించిన
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఫిర్యాదు దాఖలు చేసిన కంపెనీ ప్రతినిధిని సంప్రదించినప్పుడు.. అక్కడి ప్రతినిధులు ఈ ఘటన గురించి వివరంగా వ్యాఖ్యానించడానికి నిరాకరించాడు. టవర్ పని చేయడం ఆగిపోయినా టవర్ ఎలా కనిపించకుండా పోయిందని ఎవరికీ తెలియదని ప్రశ్నించగా.. కొత్త టెక్నీషియన్ వెళ్లిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఇక పోలీసులు ఈ దొంగతనన్ని ఎలా ఛేదిస్తారో వేచి చూడాలి.