Asianet News TeluguAsianet News Telugu

మార్చికల్లా లక్షకు పైగా ఏటీఎంలు క్లోజ్:సీఏటీఎంఐ ప్రకటన

పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికీ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఏటీఎంలలో నగదు దొరక్క నానా ఇబ్బందలు పడుతున్నారు. పెద్ద నోట్లు రద్దు అయి రెండేళ్లు పూర్తి కావస్తున్న దాని ఫలితంగా ఎదురయ్యే కష్టాలు మాత్రం నేటికి వెంటాడుతూనే ఉన్నాయి. ఆ కష్టాలను మరచిపోదామనుకునేలోపు మరో పిడుగులాంటి వార్త వెలువడింది. 

50% ATMs in India may shut down by March, warns CATMi
Author
Mumbai, First Published Nov 21, 2018, 7:58 PM IST

ముంబై: పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికీ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఏటీఎంలలో నగదు దొరక్క నానా ఇబ్బందలు పడుతున్నారు. పెద్ద నోట్లు రద్దు అయి రెండేళ్లు పూర్తి కావస్తున్న దాని ఫలితంగా ఎదురయ్యే కష్టాలు మాత్రం నేటికి వెంటాడుతూనే ఉన్నాయి. ఆ కష్టాలను మరచిపోదామనుకునేలోపు మరో పిడుగులాంటి వార్త వెలువడింది. 

ఉన్న ఏటీఎంలలో నగదు దొరక్క ప్రజలు ముప్పు తిప్పలు పడుతుంటే తాజాగా ఎటీఎం వినియోగదారులకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా మార్చి నెలాఖరుకు లక్షకు పైగా ఏటీఎంలు మూసివేసేందుకు ప్లాన్ లు వేస్తుంది. దీంతో ఏటీఎంలపై ఆధారపడే వినియోగదారులకు మరో కష్టం తోడయ్యిందని చెప్పుకోవాలి. 

కష్టాలు మెుదలయ్యాయనే చెప్పుకోవాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.38 లక్షల ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో సగానికిపైగా ఏటీఎంలు 2019 మార్చి కల్లా మూతపడే అవకాశాలున్నాయి. 

పటిష్ట నియంత్రణల ముఖచిత్రంలో మార్పుల కారణంగా ఏటీఎంల ఆపరేషన్ ఆచరణ సాధ్యం కాకపోవచ్చని, ఫలితంగా లెక్కకుమించి ఏటీఎంల మూత తప్పకపోవచ్చునని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 
 
ఏటీఎంల మూతపడటం వల్ల లక్షలాది మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రజలకు ఆర్థిక స్వావలంభన కలిగించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకూ విఘాతం కలగొచ్చు అని సీఏటీఎంఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 

మార్చి 2019 కల్లా దేశవ్యాప్తంగా సుమారు 1.13 లక్షల ఏటీఎంలను సర్వీస్ ప్రొవైడర్లు బలవంతంగా మూసివేయాల్సి రావచ్చని, వీటిలో సుమారు లక్ష ఆఫ్-సైట్ ఎటీఎంలు, 15 వేలకు పైగా వైట్ లేబుల్ ఎటీఎంలు ఉండొచ్చని స్పష్టం చేసింది. 

ఏటీఎం ఇండస్ట్రీ భారీ మార్పుల దశకు చేరినట్టు ఆ ప్రకటన పేర్కొంది. మూతపడనున్న వాటిలో మెజారిటీ ఏటీఎంలు పట్టణేతర ప్రాంతాల్లో ఉండొచ్చని, ప్రభుత్వ సబ్సిడీలను లబ్ధిదారులు మెషీన్ల ద్వారా తీసుకునేందుకు వీలు కల్పించే ఆర్థిక స్వావలంభన చర్యలకు ఏటీఎంల మూత విఘాతం కావచ్చని పేర్కొంది. 
 
ఇటీవల చేపట్టిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ వంటి నియంత్రణ చర్యల్లో మార్పులు, క్యాష్ లోడింగ్‌కు అనుసరిస్తున్న క్యాసెట్ స్వాపింగ్ పద్ధతి వల్ల ఎటీఎం ఆపరేషన్లు ఆచరణ సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడింది. అందువల్ల  ఏటీఎంలు మూతపడొచ్చని తెలిపింది. 

సాంకేతిక పద్ధతుల్లో మార్పు, క్యాసెట్ క్యాష్ స్వాప్ విధానం వల్ల కేవలం రూ.3,000 కోట్లు ఖర్చవుతుందని సీఏటీఎంఐ అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎం ఇండస్ట్రీ ఎదుర్కొన్న పరిస్థితికి అదనపు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే పరిస్థితి మరింత దిగజారవచ్చని, సర్వీస్ ప్రొవైడర్లు అంత భారీ ఖర్చులు భరించలేని స్థితిలో ఏటీఎంల మూత అనివార్యమవుతుందని సీఏటీఎంఐ ఆ ప్రకటనలో పేర్కొంది. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios