దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై 10, 11 ఏళ్ల వయసు గల ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు సౌత్‌వెస్ట్ ఢిల్లీలోని కపాషెరా ప్రాంతంలో తన కుటుంబంతో నివసిస్తోంది.

ఈ పాప మంగళవారం రాత్రి తన ఇంటిపక్కన పిల్లలతో ఆడుకుంటోంది. ఆమెను గుర్తించిన బాలురు... చిన్నారిని ఎత్తుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఎంతసేపటికి తమ బిడ్డ ఇంటికి రాకపోవడంతో తల్లి ఆ ప్రాంతంలో గాలిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు బాలురు.. తమ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతుండటాన్ని గమనించిన ఆమె అలారమ్‌ మోగించింది.

దీంతో వారిద్దరు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలికను వైద్య పరీక్షలకు పంపారు.

నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు... పాపతో అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు బాలుర తండ్రులు గుర్గావ్‌లో కార్మికులుగా పనిచేస్తున్నారు. నిందితులను బుధవారం అదుపులోకి తీసుకుని వారిద్దరిని జువైనల్ హోంకు తరలించారు.