న్యూఢిల్లీ: హర్యానా రాష్ట్రంలో ఐదేళ్ల బాలిక ఆడుకొంటూ బోరు బావిలో పడింది. బాలికను కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు.

హర్యానా రాష్ట్రంలోని  హర్యానా కమల్ జిల్లాలోని హర్షినింగుపురా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఐదేళ్ల బాలిక తమ కుటుంబానికి చెందిన వ్యవసాయ పొలంలో ఆడుకొంటూ వెళ్లి 55 అడుగుల లోతున్న బోరుబావిలోపడిపోయింది.

AlsoRead తమిళనాడు బోరు బావి ప్రమాదం: సుజిత్ కథ విషాదాంతం...

బాలిక కోసం  కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాలిక బోరుబావిలో పడినట్టుగా గుర్తించారు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అధికారుకలు సమాచారం ఇచ్చారు. అధికారులు బోరుబావిలో పడిన బాలికను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల బాలికను వెలికితీసేందుకు ఎన్డీఆర్ఎప్ బృందాలు రంగంలోకి దిగాయి. బోరుబావిలో పడిన బాలికకు  ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నారు.బోరుబావిలో పడిన బాలిక శబ్దాలను తల్లిదండ్రులకు విన్పించారు. బాలికను సురక్షితంగా వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

గత నెల 29వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో కూడ బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు సుజిత్ ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజులకు పైగా సుజిత్ కోసం సహాయక చర్యలను చేపట్టారు. మూడోరోజున సుజిత్ మృతదేహన్ని అక్టోబర్ 29వ తేదీన అధికారులు వెలికితీశారు.

 తమిళనాడులో బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ మరణించాడు. బాబును సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు మూడు రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించాయి.

అయితే ముందుగా అనుకున్న లోతు కంటే మరింత అడుగుకు బాలుడు జారిపోవడంతో చిన్నారిని రక్షించడం సాధ్యం కాలేదు. భౌతికకాయం పూర్తిగా కుళ్లిపోయింది.. . తిరుచ్చి జిల్లా నడుకాట్టుపట్టికి చెందిన సుజిత్  తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ సుమారు 600 అడుగుల లోతైన బోరు బావిలో పడిన సంగతి తెలిసిందే.. 

బోరు బావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్ ను వెలికి తీసేందుకు గాను తిరుచ్ఛిపల్లి, కోయంబత్తూరు, మధురై నుండి నిపుణుల బృందం వచ్చింది.పసిబాలుడి నడుము చుట్టూ తాడును బిగించి  బోరు బావి నుండి వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. మూడు దఫాలు ఈ రకంగా చేసిన ప్రయత్నాలు విపలమయ్యాయి. 

సుజిత్ ను బోరు బావి నుండి వెలికితీసేందుకు గాను బోరు బావి పక్కనే సమాంతరంగా మరో సొరంగం తవ్వుతున్న సమయంలో సుజిత్ విల్సన్  బోరు బావిలో మరింత కిందకు జారిపోయినట్టుగా  తమిళనాడు రాష్ట్ర మంత్రి విజయభాస్కర్ ప్రకటించారు.

తొలుత 27 అడుగుల లోతులో ఉన్న సుజిత్ విల్సన్ ఆ తర్వాత 70 అడుగుల  లోతులోకి కూరుకుపోయినట్టుగా మంత్రి  విజయభాస్కర్ చెప్పారు.బోరు బావిలో పడిన సుజిత్ విల్సన్ ను బయటకు తీసేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పోర్స్, ఎన్‌ఎల్‌సీ సిబ్బంది బోరు బావిలో పడిన బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి విజయభాస్కర్ ప్రకటించారు.

మూడు రోజుల తర్వాత సుజిత్ మృతదేహాన్ని మాత్రమే బోరు బావి నుండి అధికారులు బయటకు తీశారు. మరోవైపు హర్యానా రాష్ట్రంలో బోరు బావిలో పడిన ఐదేళ్ల బాలికను సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.