తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా అరసంబట్టు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  వీరంతా పాఠశాలలో ఏడో తరగతి చదువుకుంటున్నారు. అబ్బాయిలతో మాట్లాడారని వీరిని తోటి విద్యార్థులు ఎగతాళి చేయడంతో.. దానిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.