న్యూఢిల్లీ: గ్రేటర్‌ నోయిడాలో ఆదివారం నాడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతిచెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మారుతి కారులో  హర్యానా రాష్ట్రంలోని  బల్లాబ్‌రాత్  ప్రాంతానికి బయలు దేరారు. వీళ్లు ప్రయాణం చేస్తున్న వాహనాన్ని గుర్తు తెలిని వాహనం ఢీకొట్టింది.  న్యూఢిల్లీలోని  ఈస్ట్రన్ పెరపెరల్ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై బాధిత కుటుంబం ప్రయాణీస్తున్న కారును వెనుక నుండి ఢీకొట్టింది.

read more చిత్తూరు: వాహనాలపైకి దూసుకెళ్లిన కంటైనర్, 12 మంది దుర్మరణం

ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందినవారిలో ముగ్గురు మహిళలు కూడ ఉన్నారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.అయితే ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.