Asianet News TeluguAsianet News Telugu

బీహార్ లో కల్తీ మద్యం తాగి ఐదుగురి మృతి.. మరో నలుగురికి అస్వస్వత..

బీహార్లోని సరన్ జిల్లాలోనూ కల్తీ మద్యం తాగడం వల్ల ఐదుగురు మరణించిన ఘటన జరిగిన వారంలోపే మరో విషాదం జరిగింది. దానికి వారం రోజుల ముందు నలంద జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. గత ఏడాది కల్తీ మద్యం తాగి 40 మందికి పైగా మరణించారు. ఈ ఘటనపై బీహార్ సీఎం Nitish Kumar దర్యాప్తునకు ఆదేశించారు.

5 more die in Buxar as hooch tragedy in 'dry' Bihar sees no end
Author
Hyderabad, First Published Jan 27, 2022, 12:51 PM IST

పాట్నా : సంపూర్ణ Prohibition of alcohol అమలులో ఉన్న State of Biharలో Adulterated alcohol తాగి ఐదుగురు మరణించారు. బీహార్లోని బక్సర్ జిల్లా దుమ్రావ్ లో కల్తీ మద్యం తాగి ఐదుగురు వ్యక్తులు మరణించారు. కల్తీ మద్యం తాగిన మరో నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఐదుగురు deathపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్సారీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

బీహార్లోని సరన్ జిల్లాలోనూ కల్తీ మద్యం తాగడం వల్ల ఐదుగురు మరణించిన ఘటన జరిగిన వారంలోపే మరో విషాదం జరిగింది. దానికి వారం రోజుల ముందు నలంద జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. గత ఏడాది కల్తీ మద్యం తాగి 40 మందికి పైగా మరణించారు. ఈ ఘటనపై బీహార్ సీఎం Nitish Kumar దర్యాప్తునకు ఆదేశించారు. కల్తీ మద్యం తాగి మరణిస్తున్న ఘటనలు తరచూ జరుగుతుండటంతో ప్రతిపక్షాలు సీఎం నితీష్ కుమార్ పై విమర్శ లకు దిగారు. 

మిత్రపక్షమైన BJP కూడా సీఎంపై ధ్వజమెత్తింది. మద్యనిషేధ చట్టం పూర్తిగా విఫలమైనందున దాన్ని రద్దు చేయాలని మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ డిమాండ్ చేశారు. మద్యనిషేధం చట్టాన్ని కఠినంగా అమలు చేయని అధికారులే డబ్బులు దండుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్ అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బీహార్ లో కల్తీ మద్యం వల్ల మరణాలకు బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ తన పదవికి  రాజీనామా చేయాలని ఆర్జెడి అధికార ప్రతినిధి శక్తి సింగ్ యాదవ్ కోరారు. 

ఇదిలా ఉండగా, జనవరి 15న Bihar రాష్ట్రంలోని నలందలో కల్తీ మద్యానికి ఐదుగురు మరణించారు. spurious liquor తాగడం వల్లే ఈ ఐదుగురు చనిపోయినట్టుగా మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని అధికారులు మాత్రం ధృవీకరించడం లేదు. police సంఘటన స్థలానికి చేరుకొని ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారు. మద్యం సేవించిన మరికొందరు ఆసుపత్రుల్లో చేరినట్టుగా సమాచారం. 

జనవరి 14 రాత్రి కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారని మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టుగా చెప్పారు. మృతుల్లో ఒకరైన మన్నా మిస్త్రీ బంధువు సునీల్ కుమార్ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. మద్యం తాగి రాత్రి 11 గంటలకు మన్నా ఇంటికి వచ్చినట్టుగా చెప్పారు. అప్పటికే అతని అస్వస్థతతో ఉన్నాడని చెప్పారు. అతడిని ఆసుపత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మరణించినట్టుగా సునీల్ కుమార్ చెప్పారు.గత కొన్ని నెలలుగా చోటీ పహారీ ప్రాంతంలో దేశీయ మద్యం తయారౌతుందని సునీల్ చెప్పారు.

బీహార్ ముఖ్యమంత్రి Nitish Kumar  స్వంత జిల్లా Nalanda లో ఈ ఘటన జరగడం కలకలం రేపుతుంది.. బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అయితే కల్తీ మద్యంతో ఐదుగురు మరణించడం మద్యపాన నిషేధం అమలుపై చర్చకు కారణమైంది. కాగా, గత ఏడాది నవంబర్ మాసంలో కల్తీ మద్యం సేవించి 50 మంది మరణించారు. బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో నవంబర్ మాసంలో కల్తీ మద్యానికి ఎనిమిది మంది చనిపోయారు. అంతకుముందు ముజఫర్‌పూర్ లో ఐదుగురు చనిపోయారు. గోపాల్‌గంజ్‌లో ఎనిమిది మంది చనిపోయారు. నమస్తపూర్ లో పలువురు కల్తీ మద్యం సేవించి చనిపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios