తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కేరళకు చెందిన ఓ కుటుంబం కారులో వెళుతుండగా... ఎదురుగా వస్తున్న ఓ లారీ పాలక్కాడ్- సాలెం రహదారిపై శనివారం ఉదయం ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు.

ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారు డ్రైవర్ సహా ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. కారు డ్రైవర్ మహ్మద్ బషీర్ ఒడిశాకుచెందిన వ్యక్తిగా గుర్తించారు. వారంతా జీవనోపాధి నిమిత్తం వలస వస్తూ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.