మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో సోమవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.

మీడియా వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. కోబ్రా మెండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ ప్రారంభించారు.

ఈ క్రమంలో పోలీసులు, మావోలకు మధ్య కాల్పులు జరిగాయి. మృతుల్లో ఇద్దరు మహిళ మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఇంకా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. 

రెండు రోజుల క్రితం కూడా కోబ్రా మెండా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోలకు మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.