ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ లో శనివారం భారీ  ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ  ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు భారత జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. అంబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు.

 కాగా... మావోయిస్టులను ఎదుర్కొందుకు మరింత మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అవసరం కాగా... ఘటనాస్థలికి వారు  చేరుకోలేకపోతున్నట్లు సమాచారం. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. 

మావోయిస్టులు ఎక్కువ మంది ఆ ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను చికిత్స నిమిత్తం తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.