వస్త్ర దుకాణంలో అగ్రిప్రమాదం జరిగి...ఐదుగురు సజీవదహనమైన సంఘటన మహారాష్ట్రలోని పూణె జిల్లా ఉరులేదేవాచీ గ్రామంలో చోటుచేసుకుంది.  గురువారం తెల్లవారుజామున దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. 

అగ్నిమాపక  ఘటనాస్థలికి చేరుకుని నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పివేశారు. విలువైన వస్త్రాలు మంటల్లో కాలిపోవడంతో ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనావేస్తున్నారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.