Asianet News TeluguAsianet News Telugu

కరెంట్ తీగలకు తగిలిన బస్సు.. ఐదుగురు మృతి, భారీగా క్షతగాత్రులు

తమిళనాడులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్ల తగిలి ఓ ప్రైవేట్ బస్సు కాలి బూడిదయ్యింది. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృత్యువాత పడగా.. మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు

5 killed and 10 electrocuted in tamilnadu over bus contact with electricity wires ksp
Author
Chennai, First Published Jan 12, 2021, 2:18 PM IST

తమిళనాడులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్ల తగిలి ఓ ప్రైవేట్ బస్సు కాలి బూడిదయ్యింది. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృత్యువాత పడగా.. మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

తంజావూర్ జిల్లాలోని తిరువైయారు సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తంజావూర్ వైపు వెళ్తుండగా తిరువైయారు వద్ద విద్యుత్ తీగలను రాసుకుంటూ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

దీంతో ఒక్కసారిగా బస్సు మొత్తం విద్యుత్ సరఫరా అవ్వడంతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ఆ వెంటనే మంటల చెలరేగి క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి.

ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios