Asianet News TeluguAsianet News Telugu

నాలాలో పడిన కారు..ఐదుగురు మృతి

నాలాలో కారు పడిన ఘటన అనంతరం అల్ ఖైర్ ప్రతినిధులు సహాయ పునరావాస పనులు చేపట్టారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న రోడ్డు వల్లే ప్రతీనిత్యం రగ్గి నాలా వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షి ముక్తార్ అహ్మద్ చెప్పారు. 

5 Killed After Car Plunges Into Rivulet In Jammu And Kashmir
Author
Hyderabad, First Published Jun 27, 2020, 7:24 AM IST

అతివేగం ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. కారులో ప్రమాదవశాత్తు నాలాలో పడి ఐదుగురు జలసమాధి అయ్యారు. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లోని దోడ జిల్లాలో జరిగింది. ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు గుల్ నుంచి తాత్రీ పట్టణానికి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తూ దోడ జిల్లా రగ్గి నాలాలో పడింది. లోతైన నాలాలో కారు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు నీటిలో మునిగి మరణించారు. 

నాలాలో కారు పడిన ఘటన అనంతరం అల్ ఖైర్ ప్రతినిధులు సహాయ పునరావాస పనులు చేపట్టారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న రోడ్డు వల్లే ప్రతీనిత్యం రగ్గి నాలా వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షి ముక్తార్ అహ్మద్ చెప్పారు. 

నాలాలో వాహనాలు పడిపోకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. 244 నంబరు జాతీయ రహదారి నుంచి చెనాబ్ లోయకు వెళ్లే దారి ప్రమాదాలకు హాట్ స్పాట్ గా మారింది. గత వారం కూడా మూడు వేర్వేరు ప్రమాదాల్లో 20 మంది మరణించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ పనులు చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios